Sunday 16 June 2013

శేఖర్ //పరివేదన //

జుట్టు తెల్లబడీంది,
పళ్ళు ఊడిపొయాయి,
నీకు నడక నేర్పిన నేను
ఈనాడు నడవలెక పొతున్నా,
నీకు దారి చూపిన ఈ కనులు
నేడు కనిపించట్లేదు,
భుజాలలొ సత్తువ లేదు,
వంట్లో రక్తం లెదు
ముగ్గుబుట్ట వంటీ తల ,
కంపుకొట్టె శరిరం ,
అయినా పర్లేదు కదా నాయినా !!
నువ్వు నన్ను అక్కున చేర్చుకుంటావ్ కదూ !
అనాధ ఆశ్రమాలంటూ అనాధగ వదిలేయవు కదా ??
బిడ్డా ! నీకు గుర్తుందో లేదో మరీ ,
నీకై నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో ..
నిన్ను భుజాన్ని యెత్తుకొని తిప్పిన రోజులా......
నువ్వు చిన్నప్పుడు గుండెల మీద తన్నితే హాయిగా భరించాను ..
కాని ఈనాదు అదే చేస్తే తట్టుకొలేను నాయనా ..
నువ్వు తింటే చాలు అనుకున్నాను ,
నువ్వు నా మీద పొస్తే ఆనందించిన క్షణాలు ..
నిన్ను కంటిపాపలా చూసుకున్నానే ,,
నేడు నాకు కన్నీరు మిగిల్చి పోవూ కదా!!
కడదాక తోడుంటావు కదా కన్నా..
చివరి కట్టెను నువ్వె పేరుస్తావు కదూ ...
అనాధ శవంలా వదిలేయకే

priyaa

ప్రియా!
ఎందుకింత ఆలోచన ....
ఏదొ తెలియని భావం నీతో మాట్లాదుతుంటే..
ఏదొ తెలియని మైకం నీ పలుకులు వింటుంటే...
ఏమొ తెలియదు ఎందుకు ఈ సంఘర్షనో..
నా భావాన్ని మొత్తం ఈ కవితలో చొప్పిస్తున్న...
కాని ఏం చేస్తాం నీకేమొ సరిగా తెలుగు రాదాయె...
నీవు లేని నా భవిష్యథు మిద భయంగ ఉంది...
నీ తొడు లేని నా జీవితం వ్యర్ధమంటొంది..
జన్మ జన్మలకి వేచి చూస్తాను అని చెప్పను..
ందుకంటే ఈ జన్మకు నిను కావలనుకుంటున్నను......
మూడు జన్మల భందం అని చెప్పను..
కాని ఈ జన్మలో మూడు ముళ్ళు ,ఏడు అడుగులు నడవాలని ఉంది నీథో..
ఏంటొ మరి.....
దేవునికి ఒకింత కుళ్ళు అనుకుంట... ....శేఖర్

Friday 14 June 2013

కవితా .

కవితా ....
నిజమై కనిపించని నిన్ను..
నా కనుల లోతుళ్ళో వెతుకుతున్న....
నేను ఎన్ని రాసిన నీకు అర్దం కాదాయె....
అదే నీకు సరిగ్గ తెలుగు రాదాయె...
నువ్వు కనిపించే చోటు నా ఊహల్లోనే అని తెలిసాకా ఎక్కువ సేపు నిద్ర పోతున్ననే...
అది చూసి బద్దకం అని అనుకుంటున్నారు పిచ్చి జనం...
అది నీ మీద ప్రేమ అని తెలీదు కదా...
కవితా .....
నా ఊహా వనితా....
శేఖర్♥

//నా కల//

//నా కల//
లేచి లేవగానే కాపీ తేవడం లేటయిందని తిట్టిపోసా త్రిషాని...
ఇంతలో స్నానానికి వేన్నీల్లు రెడీ అంది రంభ...
ఇంతలో తాప్సీ వచ్చి తలంటుతానంటే ...
అనుష్క వచ్చి తలకి ఆయీల్ రాసింది....
అంతా అయ్యాకా టబు టిఫ్ఫిన్ రెడీ చేస్తె లొట్టలేస్తు తిన్నానూ...
ఇంతలో రోజూ కలలో కనిపించి మురిపించే రంభ,ఊర్వశి,మేనకలు ఎక్కడ అలక పానుపు ఎక్కుతారో అని వారికై నేను నిదరా పానుపు ఎక్కాను..
భోజనానికి లెటైంది అని తమన్న పిలుపుతో లేచి..
అనసూయ వడ్డించిన ఆవకాయ ..
ఇలా మ్రుష్టాన్న బొజనం అయ్యాక...
తిని అయాసపడుతున్న నాకూ ఐశ్వర్యా రాయ్ కాళ్ళు వత్తుతుంటె..
విద్యా బాలన్ వింజామర విసురుతోంది....
ఇంతలోనే ఎక్కిళ్ళు వస్తుంటే emma watson వచ్చి మంచి నీళ్ళు ఇచ్చింది....
ఇన్ని మధుర ఘట్టాలు జరుగుంతుంటే ...
.
.
.
ఎటునించో వినపించింది మ అమ్మ గొంతు...
ఇంతమందిని ఎక్కడ దాచాలో తెలియక కంగారు పడుతుంటే...
మా అమ్మ ఒక తన్ను తన్నితే తెలివి వచ్చింది..
కల అని తెలిసింది...
నా బతుకు ఇలా తెల్లవారింది..

శేఖర్

కవితా//విజయ శేఖర్ ఉపాధ్యాయుల//


కవితా
నిజమైన నా జీవితంలో ఒక కలలా కనిపించావు....
కవ్వించావ్,మురిపించావ్ ,మైమరపించవ్.....
అంతలోనే అంతర్ధానమయ్యావు...
నువ్వు లేని జిందగి నాకు జిగుప్స గా అనిపిస్తోంది...
గుండెల్లొ నీకై కట్టిన గుడులన్నీ నా కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయ్....
నీవు లేక నా మనసు నాతో మాటాడనంటోంది....
మరణంతో మటాడదామని చూస్తున్నా....
కాని నీవు లేని స్వర్గం నరకమే కదా ..
అందుకే ఒకింత ఆలోచిస్తున్నా....
శశి కోసం అభిమన్యుడిలా..
పార్వతికై దేవదాసుల.....
రేపటి వెలుగుకై ఎదురుచూస్తున్న చీకటిలా నీకై ....కవితా
వడి వడిగా నీ ఒడిలో ఒదగాలని...
నీ ప్రేమ చిరు జల్లుల్లో తడవాలని...
నా మది మురవాలని....
ఎన్నాల్లనుంచో...
కాని కవితా కనిపించవు కదా...
ఇకనైన కనిపించి నను కరుణించవా ...
కవితా!!

Tuesday 12 February 2013

ఏరా శేఖరా పలకరించడం మానేసావ్ ??

ఏముంది మాస్టారు

పలకరిస్తే పనిపాట లేదనుకుంటున్నారు....
పలకరించికపొతే పొగరనుకుంటున్నారు....

నాకు ప్రపంచం ఎదురు ..
నేను ప్రపంచానికి ఎదురు......
శేఖర్...